'మహబూబ్నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు' | No Bathukamma festival tradition in mahabubnagar district, says D K Aruna | Sakshi
Sakshi News home page

'మహబూబ్నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు'

Sep 28 2014 2:03 PM | Updated on Oct 8 2018 5:04 PM

'మహబూబ్నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు' - Sakshi

'మహబూబ్నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు'

మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాలో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, గద్వాల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.

హైదరాబాద్: మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాలో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అలాంటి జిల్లాలో బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవితను పిలవడమేంటని అరుణ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లో సీఎల్పీ కార్యాయలంలో అరుణ మాట్లాడుతూ... పండగ సెంటిమెంట్తో అధికార టీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని విమర్శించారు. ఈ సాకుగా చూపి ప్రజలను విభజించాలనుకుంటోందని ఆరోపించారు.

తెలంగాణ సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడామని డికే అరుణ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దసరా పండగకు సెలవులు పెంచి... సంక్రాంతికి తగ్గించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement