
సచివాలయం వద్దకు వచ్చిన వికలాంగులు
సాక్షి. హైదరాబాద్: నీరవ్‌మోదీ కుంభకోణం చిరు వికలాంగుల ఉద్యోగులను రోడ్డు పాలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న గీతాంజలి జేమ్స్ జ్యువెల్లరీ కంపెనీలో 600 మంది ఉద్యోగుల్లో 200 మంది వికలాంగులు పని చేస్తున్నారు. ఆ కంపెనీని కుంభకోణంలో భాగంగా అధికారులు సీజ్ చేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. దీంతో తమ బాధ ప్రభుత్వానికి చెప్పుకుందామని శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లిన వికలాంగులకు అక్కడి అధికారులు సచివాలయానికి వెళ్లాలని సూచించారు.
అక్కడా ఫలితం లేకపోవడంతో గేటు దగ్గర ఉన్న అధికారులకు వినతి పత్రం సమర్పించి, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. పెద్దలు చేసిన తప్పులకు చిరు ఉద్యోగులం రోడ్డుపాలయ్యాం దేవుడా.. నువ్వే దిక్కంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.