
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దివ్యాంగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఘటన జరిగింది. దివ్యాంగులపై జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ దౌర్జన్యానికి దిగారు. వినతి పత్రం తీసుకుని విసిరిపడేశారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, దివ్యాంగులపై కూటమి సర్కారు నిర్దయగా వ్యవహరిస్తోంది. వైకల్య శాతం తగ్గించేసి అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తోంది. వారికి ఆర్థిక ఆసరాను అందకుండా చేస్తోంది. పూర్తిగా మంచానికే పరిమితమైనా.. మానసిక వికలాంగులుగా ఉన్నా.. కనీస కనికరం లేకుండా నోటికాడ కూడును లాగేస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి పింఛన్లు మార్పుచేస్తూ తీరని వేదన మిగులుస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. నాడు ఉన్న అర్హత నేడు ఎక్కడికి వెళ్లిందంటూ కన్నీళ్లు పెడుతున్నారు.