అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జ్లిలా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీ పరిధిలోని మెట్టిల గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జ్లిలా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీ పరిధిలోని మెట్టిల గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మయూరు కవిత(20)కు ఆరు నెలల కిందట యాచారం మండలానికి చెందిన మధు(24)తో వివాహమైంది.
కాగా కొద్ది రోజుల కిందట తల్లిగారింటికి వచ్చిన కవిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.