ఆమరణ నిరాహారదీక్షకు దిగిన ‘నారాయణ’ టీచర్స్‌

Narayana Educational Institute Employees To Sit On Hunger Strike At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా ఆపత్కాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న నారాయణ విద్యాసంస్థల తీరును నిరసిస్తూ పలువురు ఉపాధ్యాయులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బుధవారం సాయంత్రం రామంతపూర్‌ నారాయణ కాన్సెప్ట్‌ స్కూల్‌లో పనిచేస్తున్న రవికుమార్‌ అనే ఉపాధ్యాయుడి ఇంట్లో దీక్షకు పూనారు. పనిచేసిన దానికి జీతం ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  

లాక్‌డౌన్‌ ప్రకటించినప్పట్నుంచి విద్యావ్యాపారంలో అగ్రగామిగా చెప్పుకునే నారాయణ, శ్రీచైతన్య సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో క్లాస్‌ చెప్పమని, ఫీజులు వసూలు చేయమని, ఆడ్మిషన్లు చేయాలని, రెన్యువల్స్‌ చేయాలని ఉద్యోగులపై యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని నారాయణ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యాజమాన్యం చెప్పిన పని చేస్తే కేవలం సగం జీతమే ఇస్తామని, అభ్యంతరం ఉంటే ఉద్యోగానికి నిరభ్యంతరంగా రాజీనామా చేసి పోవచ్చని బెదిరింపులకు దిగుతున్నారని వారు పేర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top