నారాయణ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | narayana college student suicide attempt in hyderabad | Sakshi
Sakshi News home page

నారాయణ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Nov 21 2017 1:48 PM | Updated on Nov 9 2018 5:02 PM

టీచర్‌ వేధింపులు భరించలేక కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని నారాయణ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో నవ్యశ్రీగౌడ్‌ అనే విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: టీచర్‌ వేధింపులు భరించలేక కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని నారాయణ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో నవ్యశ్రీగౌడ్‌ అనే విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. కొంతకాలంగా లెక్కల టీచర్ కీర్తి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విద్యార్థిని చెబుతోంది.

పరీక్షలు బాగా రాసినా తక్కువ మార్కులు వేస్తోందని, ఆ తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని స్కేల్‌తో కొడుతున్నట్లు తెలిపింది. దీంతో మానసిక వేదనకు గురైన నవ్యశ్రీ  చేతిని బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి దండ్రులకు విషయం తెలియజేయడంతో వారు మంగళవారం కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement