రచనల్లో రాణిస్తున్న నమిలికొండ సునీత

Namilikonda Sunitha Success In Poetry Writing In Nizamabad - Sakshi

డాక్టర్‌ సినారె చేతుల మీదుగా శ్రీకిరణ్‌ సాహితీ సంస్థ ప్రతిభామూర్తి పురస్కారం

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి పట్టణంలో స్థిరనివాసమున్న డాక్టర్‌ నమిలికొండ సునీత ఉపాధ్యాయురాలిగా, కవి, రచయితగా రాణిస్తూ ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు పొందారు. వివిధ అంశాలపై 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రాలను సమర్పించారు. 2000 సంవత్సరంలో డాక్టర్‌ సినారే చేతుల మీదుగా శ్రీకిరణ్‌ సాహితీ సంస్థ ప్రతిభామూర్తి పురస్కారం, 2018 సంవత్సరానికి గాను కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్‌ రాష్ట్రస్థాయి ద్వా.నా.శాస్త్రి సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఎన్నో రేడియో ప్రసంగాలు, ప్రభాత కిరణాలు, వరంగల్‌ జిల్లా పత్రికలు–సాహిత్య కృషి, వ్యాసాలు, కవితలు, గేయాలు, పద్యాలు, లేఖా రచనలు, కథానికలు, ఆయా దినపత్రికలు, మాస పత్రికల్లో వ్యాసాలు రాశారు. 

అన్ని రంగాల్లోరాణిస్తున్నా..
గగనతలంలో విజయ కేతనం నిలపగలిగిన మహిళా అవనిపై సాధికారత సాధించలేక ఆకాశపుష్పంగా మిగిలిపోతుంది. పెళ్లి పేరుతో సర్దుబాటు, తరాలు మారిన తరుణుల తలరాతలు మారలేదనేది నిష్ఠుర సత్యం. అయినా పోటీ ప్రపంచంలో నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ కుటుంబ శ్రేయస్సే తన ధేయ్యంగా భావిభారత వారసురాలిగా దేశప్రగతిలో ప్రాత ధారిగా, ప్రపంచానికే ఆదర్శమూర్తులుగా నిలుస్తున్నారు.

– డాక్టర్‌ నమిలికొండ సునీత, రచయిత్రి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top