వేగంగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త | Nalgonda SP launches Interceptor Vehicle | Sakshi
Sakshi News home page

వేగంగా వెళ్తున్నారా..అయితే జాగ్రత్త

Jun 22 2015 5:11 PM | Updated on Aug 29 2018 4:16 PM

వేగంగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త - Sakshi

వేగంగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త

రోడ్డుపై అతి వేగంగా వెళ్లేవారికి హెచ్చరిక. అతి వేగంతో వెళ్లేవారిని అదుపుచేయడం కోసం నల్గొండ పోలీసులు ప్రత్యేక వాహనాన్ని తెప్పించారు.

నల్గొండ జిల్లా : రోడ్డుపై అతి వేగంగా వెళ్లేవారికి హెచ్చరిక. అతి వేగంతో వెళ్లేవారిని అదుపుచేయడం కోసం నల్గొండ పోలీసులు ప్రత్యేక వాహనాన్ని తెప్పించారు. వేగంగా వెళ్లేవారు ప్రమాదాలకు గురికావడమే కాకుండా వారి వల్ల ఎదుటి వారికి కూడా ప్రాణనష్టం జరుగుతోంది. ఇటువంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం నల్గొండ పోలీసులు ఈ 'ఇంటర్సెప్టర్' వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు.

అతివేగంతో వెళ్తున్న వాహనాలను కిలోమీటర్ దూరం నుంచే పసిగట్టడం ఈ వాహనం స్పెషల్. సుమారు రూ.30 లక్షలతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనంలో స్పీడ్‌ను గుర్తించే కెమెరాలతో పాటు అత్యవసర ప్రథమచికిత్స సామగ్రి, బ్రీత్ అనలైజర్ పరికరాలు ఉంటాయి. వేగంగా వెళ్లే వాహనాలను ఇట్టే గుర్తించి తన కెమెరాలో బంధింస్తుంది. వాహనదారునికి జరిమానాతో పాటు శిక్షపడే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ చెబుతున్నారు. త్వరలో మరిన్ని వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement