కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,
దిగ్విజయ్‌సింగ్‌కు నల్లగొండ యూత్ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
సాక్షి, సిటీబ్యూరో : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్‌కు నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు రవీందర్‌రెడ్డి, ఉదయ్‌చందర్‌రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో దిగ్విజయ్ సింగ్‌ను కలిసి నల్లగొండ జిల్లా పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక అందజేశారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణలతో రోజురోజుకు పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతుందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ సంస్థాగత పదవుల్లో యువతకు తగిన ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు పిలుపునిచ్చి యువతను భాగస్వాములు చేయాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన బృందలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు నందన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పవన్ ఉన్నారు.