ఓయూ విద్యార్థులకు పరిపక్వతలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆక్షేపించారు.
మహబూబ్‌నగర్(నాగర్‌కర్నూల్): ఓయూ విద్యార్థులకు పరిపక్వతలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆక్షేపించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తానని చెబుతున్నారని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దీనికి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని నాగం డిమాండ్ చేశారు.