కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్‌ రెడ్డి | Nagam Janardhan Reddy Vishnu Vardhan Reddy Joins BRS | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్‌ రెడ్డి

Published Tue, Oct 31 2023 1:37 PM | Last Updated on Tue, Oct 31 2023 3:17 PM

Nagam Janardhan Reddy Vishnu Vardhan Reddy Joins BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నాగం జనార్ధన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి తోడుగా రావాలని కోరినట్లు పేర్కొన్నారు. విష్ణురెడ్డి భవిష్యత్తుపై తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. నాగం జనార్ధన్‌ రెడ్డి నేను అనేక పోరాటాలు చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో పాత, కొత్త నేతలు అందరూ కలిసి పనిచేశాలని పిలుపునిచ్చారు. ఈసారి పాలమూరులో 14కు 14సీట్లు గెలవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని సీఎం తెలిపారు. ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారన్న కేసీఆర్‌.. మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించి ఇలాంటి శక్తులకు బుద్ది చెప్పాలని అన్నారు.
చదవండి: ‘ఇంకా ఆధారాలు కావాలా?’.. ఎంపీ దాడిపై కేటీఆర్‌ ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement