'తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి' | nagam janardhan reddy slams kcr on patel birth anniversary | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి'

Oct 31 2014 4:24 PM | Updated on Sep 2 2017 3:39 PM

'తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి'

'తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి'

విలీన దినోత్సవం, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించనందుకు తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: విలీన దినోత్సవం, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించనందుకు తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ జయంతి కార్యక్రమానికి హాజరయ్యే సమయం కూడా సీఎం కేసీఆర్ కు లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన పటేల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం భావ్యం కాదన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరపకపోవడం దేశద్రోహం... జాతిద్రోహమని బీజేపీ ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వంపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement