కేసీఆర్‌ది తుగ్లక్ పాలన | nagam fire on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన

Aug 7 2014 2:27 AM | Updated on Mar 29 2019 9:24 PM

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన - Sakshi

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన

తెలంగాణలో కేసీఆర్‌ది తుగ్లక్ పాలన తలపిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

నాగర్‌కర్నూల్: తెలంగాణలో కేసీఆర్‌ది తుగ్లక్ పాలన తలపిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆయన పిచ్చిచేష్టల కారణంగా హైదరాబాద్ అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ దుస్తులు, వాహనాల కొనుగోలుపై చూపుతున్న శ్రద్ధ రైతులపై చూపడం లేదని విమర్శించారు.

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి నిమిషం కూడా కోత లేకుండా సరఫరా చేస్తుంటే కేసీఆర్ ఇంకా మూడేళ్ల వరకు కరెంట్ కష్టాలు ఉంటాయనడం విడ్డూరమన్నారు. విద్యార్థులు, రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement