పోచంపల్లిలో హీరో నాగచైతన్య సందడి

Naga chaithanya Came On Shooting To Nalgonda - Sakshi

సాక్షి, భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిలో ఆదివారం హీరో నాగచైతన్య సందడి చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సురేశ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ‘వెంకీమామ’ సినిమా షూటింగ్‌ రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా స్కూల్‌ తరగతి గదిలో హీరో నాగచైతన్య, హీరోయిన్లు రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పూత్, జబర్దస్త్‌ కామెడీ నటుడు హైపర్‌ ఆదిపై పలు టాకీ పార్ట్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్న పాయల్‌ రాజ్‌పూత్‌ విద్యార్థులకు చదువు చెబుతుండగా క్లాస్‌రూమ్‌లో హీరో నాగచైతన్య, హైపర్‌ ఆది సరదాగా గడిపే సన్నివేశాలను దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ) చిత్రీకరించాడు.

ఈ సినిమాలో ప్రముఖ హీరో వెంకటేశ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, వివేక్, కెమెరామన్‌ ప్రసాద్‌ మురెళ్ల, సంగీతం తమన్, ప్రొడక్షన్‌ మేనేజర్‌ నాగు తదితరులు పాల్గొన్నారు. కాగా హీరో నాగచైతన్యను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో షూటింగ్‌ లోకేషన్‌ వద్ద సందడి నెలకొంది. అనంతరం నాగచైతన్య ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రూప్‌ ఫొటో దిగారు. అలాగే హైపర్‌ఆదితో పలువురు అభిమానులు పోటీపడి సెల్ఫీలు దిగారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top