రాజుల సొమ్ము రాళ్లపాలు.. | Mullakatta superfluous puskaraghat | Sakshi
Sakshi News home page

రాజుల సొమ్ము రాళ్లపాలు..

Jul 16 2015 12:47 AM | Updated on Sep 3 2017 5:33 AM

రాజుల సొమ్ము రాళ్లపాలు..

రాజుల సొమ్ము రాళ్లపాలు..

‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ లా తయూరైంది ముల్లకట్ట వద్ద నిర్మించిన పుష్కరఘాట్ పరిస్థి తి. జిల్లాలో పుష్కర ఏర్పాట్లు కోసం

నిరుపయోగంగాముల్లకట్ట పుష్కరఘాట్
అధికారుల అత్యుత్సాహమే కారణం

 
వరంగల్ :‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ లా తయూరైంది ముల్లకట్ట వద్ద నిర్మించిన పుష్కరఘాట్ పరిస్థి తి. జిల్లాలో పుష్కర ఏర్పాట్లు కోసం ప్రభుత్వం సు మారు రూ.35కోట్లు వ్యయం చేసింది. అందులో ముల్లకట్ట వద్ద 160మీటర్ల పుష్కరఘాట్ నిర్మాణానికి సుమారు రూ.5కోట్లు వెచ్చింది. తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణకు రో రూ.కోటి వ్యయం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరిలో ని నీరు ఘాట్‌కు దాదాపు 150మీటర్ల దూరం నుం చి ప్రవహిస్తోంది. పుష్కరాలు జూలై రెండోవారం లో ప్రారంభమవుతాయని, అప్పుడు ఏ స్థాయిలో నీరు ఉంటుందన్న విషయాలను నీటిపారుదల శా ఖ అధికారులు అంచనా వేయూల్సి ఉంది. గతానుభవవాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయ్యేదికాదంటున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణల మధ్య ముఖ్య వారధి కావడంతో అక్కడి మావోయిస్టులు వస్తారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేసినా ఇంజినీరింగ్ అధికారులు అదేమీ పట్టించుకోలేదని తెలిసింది. కేవలం కాంట్రాక్టర్ల మేలు కోరి, వారి సూచనల మేరకే బ్రిడ్జి వద్ద స్నానఘట్లాలు నిర్మించారని ఆరోపణలు వస్తున్నారుు.

ముల్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు గోదావరి ప్రవహిస్తోంది. ముల్లకట్ట నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న జాతీయ రహదారికి సుమారు 300మీటర్ల దూరంలో నది ఒడ్డు వెంట ప్రవహిస్తోంది. ముల్లకట్ట బ్రిడ్జి పరిశీలనకు వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇదే విషయంపై నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ముల్లకట్ట వద్ద బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించడంతో పలువురు భక్తులు ఇదే ప్రాంతాల్లో స్నానాలు చేసేందుకు వెళ్తున్నారు. ఈ ఘాట్ వద్ద సుమారు వందకు పైగా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నా...భక్తులు మాత్రం రెండంకెలు దాటకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement