‘ఎంఎస్‌డబ్ల్యూ’తో ఎన్నో అవకాశాలు | msw with a lot of opportunities | Sakshi
Sakshi News home page

‘ఎంఎస్‌డబ్ల్యూ’తో ఎన్నో అవకాశాలు

Jun 7 2014 1:32 AM | Updated on Sep 2 2017 8:24 AM

మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎఎస్‌డబ్ల్యూ) కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలంగాణ యూనివర్సిటీ ఎంఎస్‌డబ్ల్యూ విభాగాధిపతి(హెచ్‌వోడీ) విజయ్‌కుమార్ శర్మ తెలిపారు.

మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎఎస్‌డబ్ల్యూ) కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలంగాణ యూనివర్సిటీ ఎంఎస్‌డబ్ల్యూ విభాగాధిపతి(హెచ్‌వోడీ) విజయ్‌కుమార్ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు ప్రాధాన్య త గురించి వివరించారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ఈజీ ఎస్, ఐసీడీఎస్, ఎన్‌ఆర్‌ఐడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సోషల్ వెల్ఫేర్ శాఖలు, ఏపీ సాక్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, హాస్పిటల్స్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని తెలిపారు. ముఖ్యంగా ఈ కోర్సు విద్యార్థినులకు అనువైనదన్నారు. కోర్సులో భాగం గా రెండో సంవత్సరంలో ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్పెషలైజేషన్ చేసినవారికి ప్రభుత్వ రంగ సంస్థలైన ఐసీడీఎస్, ఎన్‌ఐఆర్‌డీ, ఏపీ సాక్స్, ఈజీఎస్‌లలో ఉద్యోగావకాశాలుంటాయని పేర్కొన్నారు.

కమ్యూనిటీ డెవలప్‌మెంట్ స్పెషలైజేషన్ చేసినవారికి కమ్యూనిటీ వెల్ఫేర్(ఎస్సీ, ఎస్టీ, బీసీ) శాఖల్లో సంక్షేమ అధికారులుగా, ఎన్‌జీవో సంస్థలలో కౌన్సిలర్‌గా ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు. మెడికల్ అండ్ సైకియా ట్రీ స్పెషలైజేషన్ చేసినవారికీ మంచి అవకావాలు లభిస్తాయ ని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ అనుబంధ కళాశాలల్లో, భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో మూడు రకాల స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. కో ఎడ్యుకేషన్ వద్దనుకునే అమ్మాయిలు జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజ్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. విద్యార్థినులకు హాస్టల్ వసతి ఉందన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement