ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం | MPTC commit suicide | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

Mar 15 2017 1:31 AM | Updated on Sep 5 2017 6:04 AM

ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

తమకు నిధులు కేటాయించడం లేదని ఆవేదనకు గురైన ఓ ఎంపీటీసీ సభ్యుడు మండల సర్వసభ్య సమావేశంలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

మండల సభలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకోవడానికి ప్రయత్నం
మహబూబాబాద్‌ రూరల్‌: తమకు నిధులు కేటాయించడం లేదని ఆవేదనకు గురైన ఓ ఎంపీటీసీ సభ్యుడు మండల సర్వసభ్య సమావేశంలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

 మహబూబాబాద్‌ మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గోనె ఉమారాణి అధ్యక్షతన జరిగింది. సభ జరుగుతుండగా జంగిలిగొండ ఎంపీటీసీ సభ్యుడు బానోత్‌ బాలకృష్ణ ఒక్కసారిగా లేచి తమను పట్టించుకునే వారే లేరని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారే నిధులు వినియోగించుకోండి అంటూ బాటిల్‌లోని పెట్రోల్‌ ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు బాలకృష్ణ వద్ద నుంచి బాటిల్‌ను తీసుకుని అతడిని వారించి కూర్చోబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement