దేశం మెచ్చిన సీఎం.. కేసీఆర్‌ | MP Nama All Praises To CM KCR At Dammapeta | Sakshi
Sakshi News home page

దేశం మెచ్చిన సీఎం.. కేసీఆర్‌

Oct 12 2019 10:32 AM | Updated on Oct 12 2019 10:32 AM

MP Nama All Praises To CM KCR At Dammapeta - Sakshi

ఎంపీ నామా నాగేశ్వరరావు  

సాక్షి, దమ్మపేట: రాష్ట్రంలో చేపట్టిన ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో భారతదేశం మొత్తం సీఎం కేసీఆర్‌ను శభాష్‌ అంటోందని.. ఒక ముఖ్యమంత్రికి ఇంతకన్నా కీర్తీ ఏముంటుందని ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆర్లపెంట, లచ్చాపురం గ్రామాల్లో రూ.28 లక్షలతో నిర్మాణం చేసిన ఆరోగ్య ఉపకేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. దేశం అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికల ద్వారా గ్రామాల అభివృద్ధికి రూపొందించిన 30 రోజుల ప్రణాళిక విజయవంతం అయిందని చెప్పారు.

రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీతారామ పేరుతో చేపట్టిన శాశ్వత ప్రాజెక్టు నిర్మాణం అయితే ఉమ్మడి జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుం దని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని మాటల్లో చూపారని, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చేతల్లో చూపిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ...దమ్మపేట పూర్తి గిరిజన ప్రాం తం కావడంతో గిరిజనులంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించా రు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎంపీపీ సోయం ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ శిరీష, ఎంపీడీఓ రవికుమార్, పట్వారీగూడెం, దమ్మపేట వైద్యులు డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ శ్రీహర్ష, వైస్‌ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, మాజీ ఎంపీపీలు అల్లం వెంకమ్మ, పానుగంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement