సచివాలయాన్నే అమ్మేస్తానని ఎలా అంటారు? | motkupalli narasimhulu takes on kcr | Sakshi
Sakshi News home page

సచివాలయాన్నే అమ్మేస్తానని ఎలా అంటారు?

Feb 6 2015 4:18 PM | Updated on Aug 15 2018 9:27 PM

సచివాలయాన్నే అమ్మేస్తానని ఎలా అంటారు? - Sakshi

సచివాలయాన్నే అమ్మేస్తానని ఎలా అంటారు?

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.

ఖమ్మం: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఆయన పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మోత్కుపల్లి విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సచివాలయాన్నే అమ్మేస్తానని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసలు సచివాలయాన్ని అమ్మకానికి పెట్టాలనే యోచన ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.

 

రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి దళితుల మనోభావాలను కేసీఆర్ దెబ్బతీశారన్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఉన్నవారంతా ఉత్సవ విగ్రహాలేనని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను కోల్పోయిందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement