కుటుంబ పోషణ భారమై ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
కొండాపూర్ (మెదక్) : కుటుంబ పోషణ భారమై ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వికలాంగులైన ఇద్దరి పిల్లలను పొషించే స్థోమత లేక తల్లి తన ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిపై కిరోసిన్ పోసి అనంతరం తాను కూడా పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో ముగ్గురు పూర్తిగా కాలిపోయారు.
ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.