రెండ్రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు 

Monsoon Reaches Telangana In The Next Two Days - Sakshi

పెద్దపల్లి, జనగాం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు

భోజన్నపేటలో 13.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షం   

సాక్షి, హైదరాబాద్‌: రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వైకే రెడ్డి వెల్లడించారు. రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు రాష్ట్రంలో మొదలైనట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయని, పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో  13.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసిందని ఆయన తెలిపారు. కునూరులో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి గోరిలలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

కమాన్‌పూర్‌లో 8.8, భూపాలపల్లి, జనగాం జిల్లా రఘునాథపల్లిలో 8.7 సెంటీమీటర్ల చొప్పున వర్ష పాతం రికార్డు అయ్యింది. పెద్ద పల్లి జిల్లా శ్రీరాంపూర్‌ లో 8.3 సెంటీమీటర్లు, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, ములుగు జిల్లా మల్లంపల్లి లో 7.8 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వైకేరెడ్డి తెలిపారు . పెద్దపల్లి జిల్లా కనుకులలో 7.4, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 7.1, ఖమ్మం జిల్లా లింగాల, వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో 6.9, వరంగల్‌ అర్బన్‌ జిల్లా మర్రిపల్లిగూడెంలో 6.8, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 6.5, మల్లారంలో 6.4, కరీంనగర్‌ జిల్లా చింతకుంటలో 6.2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top