నేడు ‘మోడల్’ టీచర్ల సామూహిక సెలవులు | model teacher leave | Sakshi
Sakshi News home page

నేడు ‘మోడల్’ టీచర్ల సామూహిక సెలవులు

Feb 8 2016 3:53 AM | Updated on Sep 3 2017 5:08 PM

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు పదో పీఆర్‌సీ వర్తింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు పదో పీఆర్‌సీ వర్తింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్ టీచర్లు సామూహిక సెలవులు పెట్టి, పాఠశాలల ముందు ధర్నాలు చేయనున్నట్లు రాష్ట్ర మోడల్ స్కూల్స్ అసోసియేషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే 9 నుంచి అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ ఆందోళనల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ అమలుతో పాటు సర్వీసు రూల్స్ ఇవ్వాలని, హెల్త్ కార్డులను అందజేయాలని తదితర డిమాండ్లతో ఆందోళనలు చేయనున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement