ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి | mlc ponguleti demands resign of central ministers | Sakshi
Sakshi News home page

ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి

Oct 20 2016 2:14 PM | Updated on Mar 18 2019 9:02 PM

ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి - Sakshi

ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి

బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు రాష్ట్రాలకు అశనిపాతమని ఎమ్మెల్సీ పొంగులేటి అన్నారు.

హైదరాబాద్: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు అశనిపాతంలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నీటి పంపకాల వివాదంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ట్రిబ్యునల్ నిర్ణయం వల్ల తెలంగాణకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణం అఖిలపక్షాన్ని పిలిచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పొంగులేటి సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement