ధైర్యంగా ఉండండి | MLA sudhir reddy visitation to sandeep family | Sakshi
Sakshi News home page

ధైర్యంగా ఉండండి

Jun 9 2014 11:57 PM | Updated on Mar 28 2018 11:05 AM

ధైర్యంగా ఉండండి - Sakshi

ధైర్యంగా ఉండండి

హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గౌడవెల్లికి చెందిన బస్వరాజ్ సందీప్ గల్లంతయ్యాడనే విషయం తెలుసుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోమవారం ఆ గ్రామానికి వెళ్లారు.

 సందీప్ కుటుంబానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరామర్శ
 
మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గౌడవెల్లికి చెందిన బస్వరాజ్ సందీప్ గల్లంతయ్యాడనే విషయం తెలుసుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోమవారం ఆ గ్రామానికి వెళ్లారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. తీవ్ర దిగ్భ్రాంతి మునిగిపోయిన సందీప్ కుటుంబాన్ని సుధీర్‌రెడ్డి పరామర్శించారు. నదిలో గల్లంతైనవారికి ఆచూకీ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఘటన స్థలానికి చేరుకుని పనులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ విషాద ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుళ్లినట్లు తెలిపారు. గాలింపు చర్యల కోసం తగిన ఏర్పాట్లు చేపడుతున్నట్లు సందీప్ తండ్రి వీరేష్‌కు ఆయన వివరించారు. పరామర్శించిన వారిలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement