బోథ్‌ ఎమ్మెల్యే తిట్లపురాణం | MLA Rathod Bapurao scolds On Karobar In Adilabad | Sakshi
Sakshi News home page

బోథ్‌ ఎమ్మెల్యే తిట్లపురాణం

Published Mon, Jul 6 2020 8:46 AM | Last Updated on Mon, Jul 6 2020 11:10 AM

MLA Rathod Bapurao scolds On Karobar In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌‌: తన కారు వెళ్లే దారిలోనే ట్రాక్టర్‌ అడ్డుపెడుతారా? అంటూ బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు మావల మండలం బట్టిసావర్‌గాం గ్రామ పంచాయతీ కారోబార్‌పై తిట్ల పురాణం అందుకున్నారు. శనివారం ఆదిలాబాద్‌ నుంచి పొన్నారి శివారులోని తన వ్యవసాయ క్షేత్రానికి కారులో ఎమ్మెల్యే బయలుదేరారు. కాగా బట్టిసావర్‌గాం గ్రామంలో డీజిల్‌ అయిపోయిందని రోడ్డుపైనే పంచాయతీ ట్రాక్టర్‌ను నిలిపివేశారు.

దీంతో తన కారుకే అడ్డుగా ట్రాక్టర్‌ను నిలుపుతారా..? అంటూ గ్రామ కారోబార్‌పై మండిపడ్డారు. ట్రాక్టర్‌ నిలపడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కారోబార్‌ సమాధానం ఇచ్చినా శాంతించని ఎమ్మెల్యే ఉద్యోగంలో ఎలా కొనసాగుతావో, ఆదిలాబాద్‌కు ఎలా వస్తోవో చూస్తానని కారోబార్‌ను హెచ్చరించారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement