'2 లక్షల మందితో అసెంబ్లీ ముట్టడి' | MLA R. Krishnaiah attends BC Simha Garjana | Sakshi
Sakshi News home page

'2 లక్షల మందితో అసెంబ్లీ ముట్టడి'

Jan 19 2016 5:30 PM | Updated on Sep 3 2017 3:55 PM

విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూల్ (మహబూబ్ నగర్) : విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులో జరిగిన బీసీల సింహగర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రూ.1,800 కోట్ల రూపాయల బకాయి ఉన్న స్కాలర్‌షిప్‌లను 8 రోజుల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రెండు లక్షల మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ వర్తింపజేయాలన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ సాయాన్ని రూ.2 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement