ఇద్దరం రాజీనామా చేద్దాం.. | MLA Challa challenge to ERRABELLI | Sakshi
Sakshi News home page

ఇద్దరం రాజీనామా చేద్దాం..

May 9 2015 12:51 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఇద్దరం రాజీనామా చేద్దాం.. - Sakshi

ఇద్దరం రాజీనామా చేద్దాం..

ఎమ్మెల్యే పదవులకు ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామని, ఎవరు ఓడిపోయిన రాజకీయ సన్యాసం తీసుకుందామని..

ఎర్రబెల్లికి ఎమ్మెల్యే చల్లా సవాల్

హన్మకొండ: ఎమ్మెల్యే పదవులకు ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామని, ఎవరు ఓడిపోయిన రాజకీయ సన్యాసం తీసుకుందామని.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. హన్మకొండలో శుక్రవారం ఎమ్మెల్యే చల్లా విలేకరులతో మాట్లాడుతూ టీడీపీని వీడిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని ఎర్రబెల్లి  అంటున్నారనీ, తాను రాజీనామా చేస్తే, తనపై కానీ, సొంత నియోజకవర్గంలోకానీ పోటీ చేసి గెలిచే సత్తా ఉందా? అని ప్రశ్నించారు.

తాను ఒక్క రూపాయి తీసుకుని టీఆర్‌ఎస్‌లో చేరినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.  టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ వద్దకు ఎర్రబెల్లి అర్ధరాత్రి వెళ్లింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement