నేడు ‘మిషన్ కాకతీయ’పై సమీక్ష | Mission Kakatiya take as a movement | Sakshi
Sakshi News home page

నేడు ‘మిషన్ కాకతీయ’పై సమీక్ష

Dec 19 2014 11:53 PM | Updated on Sep 17 2018 8:02 PM

మిషన్ కాకతీయ అమలులో భాగంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణపై...

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిషన్ కాకతీయ అమలులో భాగంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణపై శనివారం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జెడ్పీలో జరిగే ఈ సమావేశంలో జెడ్పీ పాలకవర్గం పాల్గొననుంది. తొలివిడత 545 చెరువులను పునరుద్ధరించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం జరిగే సమావేశంలో ప్రణాళికపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటారు.

ఈ క్రమంలో సమావేశంలో చర్చించే అంశాలపై శుక్రవారం కలెక్టర్ ఎన్.శ్రీధర్ తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో పూడిక తీసిన అనంతరం ఆ మట్టిని రైతుల పొలాల్లో వేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చెరువుల సర్వే త్వరితంగా పూర్తిచేసి అంచనాలకు వెంటనే మంజూరు తీసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చక్రధర్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు భీంప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement