జనసేన కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటా! | Railway Koduru MLA Incident Woman Harsha Veena Releases Another Video, Threatens Protest Over Lack Of Action | Sakshi
Sakshi News home page

జనసేన కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటా!

Mar 28 2026 8:51 AM | Updated on Mar 28 2026 12:51 PM

Harsha Veena Releases Another Video

సాక్షి, రైల్వేకోడూరు : మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోనంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తనకు న్యాయం చేయడంలేదని జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరక్కపోతే జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆమె ఈ మేరకు విడుదల చేసిన ఒక వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది.

 ‘నాకు అన్యాయం జరిగింది. న్యాయం చేస్తారని బయటకు వచ్చాను. డిప్యూటీ సీఎంపై నమ్మకంతో ఎమ్మెల్యేపై పోరాడుతున్నా. కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ అన్యాయం చేస్తున్నారు. పైగా నాకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే దర్జాగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. కమిటీ నివేదిక ఇవ్వకుండా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అరవ శ్రీధర్‌ను పార్టీ ఎలా అనుమతించింది?  అసలు డిప్యూటీ సీఎం తనకు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదు?’’ ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయం చేసి అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement