అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం | missing childrens adress found | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం

Feb 21 2015 9:44 AM | Updated on Oct 19 2018 7:52 PM

నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభించింది.

హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభించింది. చిలకలగూడ, దూద్‌బావి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులు గీత (05), శ్రీకాంత్ (03), స్రవంతి (08) అదృశ్యం అయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తీవ్ర గాలింపు చర్యల అనంతరం చిన్నారులను నాంపల్లిలో శనివారం ఉదయం గుర్తించారు. గుర్తు తెలియని మహిళలు చిన్నారులను అపహరించి తీసుకెళ్లి వారి దగ్గరున్న బంగారు నగలను తీసుకుని నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement