
సాక్షి, మహబూబ్‌నగర్ : ధారణంగా ఏ చెట్టుకైనా పండ్లు గాని, కూరగాయలు గాని కొమ్మ కిందకు వేలాడుతూ కాస్తాయి. కానీ ఇక్కడ కన్పించే మిరప చెట్టుకు మాత్రం మిరపకాయలు వింతగా ఆకాశం వైపు చూస్తూ పైకి కాశాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామంలోని కుర్వ చంద్రశేఖర్ ఇంట్లోని చెట్టుకు వింతగా మిరప కాయలు కాయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.