‘నిమిషం’ నిబంధనకు ఇంటర్ విద్యార్థిని బలి | 'Minute' to the provision Intermediatestudent Bali | Sakshi
Sakshi News home page

‘నిమిషం’ నిబంధనకు ఇంటర్ విద్యార్థిని బలి

Mar 11 2016 2:07 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఇంటర్ పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా చేరుకోవటంతో పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి రూరల్:  ఇంటర్ పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా చేరుకోవటంతో పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం చెర్లగూడెంకి చెందిన లక్ష్మీ, కిష్ట య్య కూతురు ప్రవల్లిక(16) సంగారెడ్డి లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. 

ఈ నెల 2న పరీక్షల ప్రారంభంరోజునే ప్రవల్లిక పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంది. దీంతో సిబ్బంది ప్రవల్లికను లోనికి అనుమతించలేదు. ఆ తర్వాత పరీక్షలు రాస్తున్నా మొదటి పరీక్ష రాయనందున ఫెయిల్ అవుతానని ఆందోళనకు గురై బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిం చుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ గురువారం ప్రవల్లిక మృతి చెందింది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement