మత్తుకు బానిసలవుతున్న నేటి యువత

Minor Boys And Youth Are Becomming Addiction To Drug In Karimnagar - Sakshi

సాక్షి, పెద్దపల్లి : బంగారు కలలతో నగరంలో అడుగుపెడుతున్న యువత మత్తు పదార్ధాల కు బానిసలవుతున్నారు.. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం.. పట్టించుకునే వారు అం దుబాటులో ఉండకపోవడంతో సరదాగా మొదలై తర్వాత వ్యసనపరులుగా మారుతున్నా రు. నిత్యం వాటిని తీసుకోకుండా బతలేని పరిస్థితికి దిగజారుతూ జల్సాలకు అలవాటుప డి వాటికి డబ్బులు సరిపోక నేరాల వైపు మొ గ్గుచూపుతున్నారు.. అక్రమార్కులు గం జాయిని యథేచ్ఛగా సాగు చేస్తూ రహస్యంగా నగరాలకు తరలిస్తున్నారు.. దీనికి యువత అ లవాటు పడడంతో వారి పంట పండుతోంది.

ఇంకా ప్రమాదకరమైన విషయమేమిటంటే మైనర్‌ విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు కావడం అందరిని కలవరపరిచే విష యం.. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్‌ జిల్లా ల సరిహద్దు ప్రాంతాల్లోని అడవులను ఆనుకు ని ఉన్న గ్రామాల నుంచి గంజాయిని నగరా లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటుడుతున్నారు. జగిత్యాల, మం థని, సిరిసిల్ల, గోదావరిఖని, మంచి ర్యాల డి విజన్లలో గంజాయి సాగు చేస్తున్నారని తెలి సింది. వీటిని కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజూరాబాద్, గోదావరిఖని డి విజన్లలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

అక్కడ ఉన్నవారు వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారు. హుక్కాకు అ లవాటు పడినవారు కూడా గం జాయికి త్వరగా అకర్శితులవుతున్నారు. దీని కి తోడు యు వత సరదాగా గంజాయిని అలవాటు చేసుకుని చివరకు బానిసలుగా మారుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గం జాయితో సిగరెట్లు తయారు చేసి పలు దు కాణాల్లో ఎవరికీ అనుమానం రాకుండా వారి వద్దకు రెగ్యులర్‌గా వచ్చే ఖాతాదారులకు పలు కోడ్‌ పేర్లతో అమ్మకాలు చేస్తున్నారని తెలిసింది.  

బానిసలుగా మారుతున్న మైనర్లు
నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి ఇప్పటికే విచ్చలవిడిగా విస్తరించిందని సమాచారం. తిరుమలనగర్, శేషామహల్, కమాన్‌ ప్రాంతం, హౌసింగ్‌బోర్డుకాలనీ, స్టేడియం చుట్టు పక్కల, డ్యాం పరిసరాల్లో, బైపాస్‌రోడ్డు, నగరానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని సమాచారం. నగరంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలోనే ప్యాకెట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారని వీరి వలలో పలువురు విద్యార్థులు సైతం చిక్కుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి తరచు అనారోగ్యానికి గురికావడంతో అతడిని పరీక్షించగా గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది.

అతడి మిత్రులు సుమారు 20 మంది వరకు నిత్యం గంజాయి సేవనంలో మునిగితేలుతూ ఉంటారని సదరు విద్యార్థి పేర్కొనడంతో వారి తల్లిదండ్రులు అవాక్కయినట్లు సమాచారం. ఇలాంటి బ్యాచ్‌లు నగరంలో సుమారు 60 నుంచి 80 వరకు ఉన్నట్లు సమాచారం. అక్రమార్కులు 100గ్రా. ప్యాకెట్‌కు రూ.5000 ధరతో అమ్మకాలు చేస్తుండగ నిత్యం సుమారు రూ.50 వేలకు పైగా గంజాయి వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. గతంలో ప్రముఖ హోటల్‌లో కొందరు యువతీయువకులను అనుమానాస్పదస్థితిలో అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద గంజాయి లభించింది. వీరు ఎక్కడి నుంచో వచ్చి సులభంగా గంజాయిని సంపాదించారంటే ఎంత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల దాడులు..
టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి గం జాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోం ది. గంజాయి అమ్మకాలు, రవాణ చేస్తున్న పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చింది. అయితే చాలా వరకు కేసుల్లో మొదట గంజాయి అలవాటు పడి తర్వాత వారు అ మ్మకందారులుగా మారుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో గంజాయి కొ నుగోలు చేసి బానిసలుగా మారడమే కా కుండా మరికొందరిని మార్చుతున్నారు. ఇది ఒక ఫ్యాషన్‌గా మారుతోంది. ఇలా పలువురి విద్యార్ధులను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరె స్టు చేశారు.

సుమారు 250 మంది విద్యార్ధులు గంజాయికి అలవాటుపడ్డారని గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తాజాగా వారం క్రితం 8, 9వ తరగతి విద్యార్థులు కూ డా గంజాయికి అలవాటు పడ్డారని గుర్తిం చారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మొదట గంజాయికి అలవాటు పడి తర్వాత అమ్మకందారుడిగా అవతారమెత్తిన ఇంటర్‌ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పక్క టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేస్తుండడంతో గంజాయికి అలవాటు పడినవారు ఇతర ప్రాంతాలకు వెళ్లి సేవిస్తున్నారని సమాచారం. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. 

డ్రగ్స్‌ కూడా..
జిల్లాలో డ్రగ్స్‌ మూలాలు బయటపడడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. నగరంలో 2012 ఆగస్టు 2 కొకైన్‌ సరఫరా చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికిన సంఘటన తెలిసిందె. రాష్ట్ర రాజధానిలో పోలీసుల నిఘా పెరిగడంతో కరీంనగర్‌ కేంద్రంగా అమ్మకాలు చేసేందుకు డ్రగ్స్‌మాఫియా ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాలను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్న వారిలో కొందరు కరీంనగర్‌కు చెందినవారు ఉన్నారని తెలిసింది. కొందరు ఉన్నత స్థాయి విద్యార్థులు డ్రగ్స్‌ కోసం ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారని ప్రచారంలో ఉంది.

ప్రకటనకే పరిమితమైన అవగాహన
గతంలో డ్రగ్స్‌ ఆనవాల్లు బయటపడినప్పుడు వీటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన పలువురి వ్యాఖ్యలు కేవలం ప్రకటనకే పరిమతమైనాయి. కాలేజీల్లో పెడదోవ పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారికి కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేయాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. కాలేజీల్లోని పేరెంట్స్‌ కమిటీ, స్టూడెంట్‌ కమిటీలు కూడా వీటిలో పాలు పంచుకోవడంతో పాటు పోలీసులు డ్రగ్స్‌ దందాకు అడ్డుకట్ట వేసేందుకు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.గంజాయి రవాణ, అమ్మకాలు చేయడంపై 2018లో 42 మందిపై 14 కేసులు నమోదు చేశారు. 2019లో ఇప్పటి వరకూ 15 మందిపై 7 కేసులు నమోదయ్యాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top