భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి కేటీఆర్‌! | minister ktr stranded in traffic | Sakshi
Sakshi News home page

భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి కేటీఆర్‌!

Apr 27 2017 7:16 PM | Updated on Aug 30 2019 8:24 PM

ఓరుగల్లు వేదికగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) 16వ ఆవిర్భావ బహిరంగ సభ హోరెత్తుతోంది.

వరంగల్‌: ఓరుగల్లు వేదికగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) 16వ ఆవిర్భావ బహిరంగ సభ హోరెత్తుతోంది. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి భారీగా ప్రజలను, పార్టీ శ్రేణులను నేతలు తరలించారు. దీంతో సభ ప్రాంగణం జనసందోహంతో నిండిపోయింది. సభావేదిక ఆటపాటలతో, ధూమ్‌ధామ్‌ నృత్యాలను ఆహూతులను అలరిస్తోంది.

మరికాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుండగా.. హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు ఓరుగల్లు వైపు వస్తుండటంతో ఆ దారి ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయింది. ఈ ట్రాపిక్‌లోనే పలువురు మంత్రులు చిక్కుకున్నట్టు సమాచారం. మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డిలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. భారీ ట్రాఫిక్‌లో కేటీఆర్‌ చిక్కుకోవడంతో ఆయన సభకు రావడం కష్టమేనని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement