ఓరుగల్లు, ఇందూరుకు ఏసీ ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులు.. | Warangal Nizamabad Electric Buses Telangana | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు, ఇందూరుకు ఏసీ ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులు..

Oct 12 2026 5:25 AM | Updated on Oct 12 2026 6:03 AM

Warangal Nizamabad Electric Buses Telangana

పీఎం ఈ–బస్‌ సేవ పథకం కింద 151 బస్సులు మంజూరు చేసిన కేంద్రం

వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 51 కేటాయింపు

తొలిసారి టూటైర్‌ సిటీలకు ఏసీ బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో హైదరాబాద్‌ నగరంలో కేవలం ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సులను మాత్రమే తిప్పే దిశగా చర్యలు ప్రారంభ మైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరంగల్, నిజా మాబాద్‌లకు శుభవార్త చెప్పింది. పీఎం ఈ–డ్రైవ్‌ పథ కం కింద హైదరాబాద్‌కు 2,300 ఎలక్ట్రిక్‌ బస్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టూ టైర్‌ సిటీలైన వరంగల్, నిజామాబాద్‌లకు 151 ఎలక్ట్రిక్‌ బస్సులను పీఎం ఈ–బస్‌ సేవ పథకం కింద మంజూరు చేసింది. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సాయి గ్రీన్‌ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టెండర్‌ దక్కింది. మరో ఆరు నెలల తర్వాత బస్సులు ఈ రెండు పట్టణాలకు దశల వారీగా రాబోతున్నాయి. వరంగల్‌కు 100 బస్సులు, నిజామాబాద్‌కు 51 బస్సులు కేటాయించారు. తొలిసారి ఆ రెండు నగరా లలో ఏసీ ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులు సేవలందించబో తుండటం విశేషం. ప్రస్తుతం వరంగల్‌లో ప్రత్యేకంగా ఈ బస్సుల కోసం కొత్త డిపోను ఏర్పాటు చేస్తున్నా రు. అక్కడి జోనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో రూ.7.9 కోట్లతో డిపో నిర్మాణానికి టెండర్లు పిలిచారు. 

కిలోమీటర్‌కు అద్దె రూ.59.59...
పీఎం ఈ–డ్రైవ్‌ బస్సుల తరహాలోనే ఈ ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులకు కూడా ఆర్టీసీ ప్రతి కి.మీ.కు నిర్ధారిత అద్దె ను చెల్లిస్తుంది. తాజా టెండర్లలో ఈ అద్దె రూ.59.59 గా ఖరారైంది. నిజామాబాద్‌ పట్టణంలో దాదాపు నాలుగేళ్ల క్రితం సిటీ బస్సు సేవలు మొదలయ్యాయి. కానీ పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా అంత మెరుగ్గా లేదు.

ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులతో నగరంలో సిటీ సర్వీసు సేవలు బాగా మె రుగవ్వనున్నాయి. అయితే నగరంలో వీటి అవసరం ఎంత ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలే దు. దీంతో నిజామాబాద్‌కు దగ్గరలో ఉన్న పట్టణా లకు వీటిని ఎక్కువగా తిప్పాలన్న యోచనలో ఆర్టీసీ ఉంది. నిజామాబాద్‌లో ఉన్న 2 ఆర్టీసీ డిపోలకు అద నంగా కొత్తడిపో ఏర్పాటుచేసి ఈ బస్సులు కేటాయించబోతున్నారు. త్వరలో డిపో నిర్మాణం జరగనుంది.

ఏసీ సర్వీసులు సక్సెస్‌ అవుతాయా?
హైదరాబాద్‌లో ప్రయాణికులు ఎలక్ట్రిక్‌ సిటీ బస్సుల కు బాగా ఆదరిస్తున్నారు. కానీ, ఏసీ సర్వీసులకు అంత డిమాండ్‌ లేదు. గతంలో ఓల్వో ఏసీ సిటీ బస్సులు ప్రారంభించగా, ప్రయాణికులు ఆదరించకపోవటంతో ఖాళీగా తిప్పలేక, వాటిని రాజధాని సర్వీసులుగా మార్చి ఇతర పట్టణాలకు తిప్పుతున్నారు. పుష్పక్‌ బ స్సులకు డిమాండ్‌ నామమాత్రమే. హైదరాబాద్‌లోనే ఈ పరిస్థితి ఉంటే, వరంగల్, నిజామాబాద్‌లలో ఏసీ బస్సు సర్వీసులకు ఆదరణ ఎంత ఉంటుందనే అనుమానం ఉంది. ప్రయాణికుల ఆదరణ ఉండకుంటే, ఈ బస్సులకు ఆర్టీసీ చెల్లించే అద్దె సంస్థకు భారంగానే మారుతుంది.

ఇదీ చదవండి: కరీంనగర్‌ ఉక్కిరిబిక్కిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement