సాత్విక్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా | Minister Indrakara reddy announces ex-gratia of 5 lakh for satwik family members | Sakshi
Sakshi News home page

సాత్విక్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా

Jan 15 2017 9:47 AM | Updated on Sep 5 2017 1:17 AM

సాత్విక్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా

సాత్విక్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా

నిర్మల్ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందిన సాత్విక్‌ కుటుంసభ్యుల్ని ఆదివారం ఉదయం పరామర్శించారు.

నిర్మల్‌ : నిర్మల్ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందిన సాత్విక్‌ కుటుంసభ్యుల్ని మంత్రి ఆదివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సాత్విక్‌ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఇంద్రకరణ్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా శనివారం మధ్యాహ్నం స్థానిక శాంతినగర్ క్రాస్ రోడ్డు సమీపంలో అతివేగంగా వెళ్తున్న మంత్రి కాన్వాయ్లోని కారు బైక్ను బలంగా ఢీ కొట్టింది.


దీంతో బైక్పై ఉన్న తండ్రీ, కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది తరగతి చదువుతున్న సాత్విక్‌ చికిత్స పొందుతూ నిజామాబాద్‌ ఆసుపత్రిలో మృతిచెందాడు. మంత్రి డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని లక్ష్మణచాంద మండలం చింతల్ తండా వాసిగా గుర్తించారు. మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement