బహుదూరపు ‘బాటసారులు’

Migrant Workers Walking to Chhattisgarh From Hyderabad - Sakshi

శాలిగౌరారం : అసలే ఎండలు.. ఆపై వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం.. భాష రాదు.. సరైన మార్గం చేప్పేవారు లేక దారితప్పుతూ అదనపు ప్రయాణం.. ఒకపక్క ఆకలి.. మరోపక్క స్వగ్రామానికి చేరుకోవాలనే తపన.. వెరసి కాలినడకన వెళ్లే వలస కూలీలు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు.. హైదరాబాద్‌లో బోర్‌వెల్స్‌పై పనిచేస్తూ ఉపాధి పొందుతున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన 33 మంది యువకులు లాక్‌డౌన్‌తో సొంత గ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. వారు సోమవారం శాలిగౌరారం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ శనివారం హైదరాబాద్‌ నుంచి బయల్దేరామని.. మరో మూడు, నాలుగు రోజుల్లో స్వగ్రామాలకు చేరుకుంటామని వివరించారు. కాగా వీరికి స్థానికులు బియ్యం, పచ్చళ్ల అందజేయగా మండల కేంద్రంలో కొంతసేపు సేదదీరి అన్నం వండుకుని తిన్న అనంతరం తిరిగి నడక ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top