అర్ధరాత్రి యువకుల హల్‌చల్ | midnight youngers hulchal in medak district | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి యువకుల హల్‌చల్

Jun 5 2015 9:26 AM | Updated on Sep 3 2017 3:16 AM

అర్ధరాత్రి యువకుల హల్‌చల్

అర్ధరాత్రి యువకుల హల్‌చల్

పట్టణంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు హల్‌చల్ చేశారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేసు నమోదు,
రిమాండ్ తరలింపు

 
సిద్దిపేట రూరల్: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు హల్‌చల్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు వీరి తో పాటు మరో నలుగురిని పోలీసు లు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధిం చిన వివరాలను గురువారం వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలు విలేకరులకు వెల్లడించారు. పట్టణానికి చెందిన ముద్రకోల సాయితేజ (19)తో పాటు అతడి స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి వద్ద గొడవ అవుతోందని సాయితేజకు ఫోన్ రావడంతో మిత్రులతో కలిసి సిని మా మధ్యలోనే బయటకు వచ్చేశారు.

అనంతరం బైక్‌లపై ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో మెదక్ రోడ్డులో గల ఓ పెట్రోల్ బంక్‌లో బైక్‌కు పెట్రోల్ వేయించుకుని నజీర్, అతడి మిత్రులు రోడ్డుపైకి వస్తుండగా.. సాయితేజ, అత డి స్నేహితులు అతడిని తిట్టారు. ఈ క్ర మంలో వీరి మధ్య మాట మాటా పెరిగింది. దీంతో సాయితేజ తన సోదరుడైన ముద్రకోల శశికుమార్‌కు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. దీంతో మందు పార్టీ చేసుకుంటున్న శివకుమార్.. తన స్నేహితులైన గౌరబోయిన వెంకటేష్, బైరాం చందు, మెరుగు ఉదయ్, కంకటి నవీన్‌లతో కలిసి (బీరు సీసాలతో) అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న నజీర్, అతడి మిత్రుడితో గొడవ పడ్డారు.

అదే ప్రాంతంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు సమావేశం నిర్వహిస్తుండగా.. శశికుమార్ గ్యాంగ్ తమ వెంట తెచ్చిన  బీరు సీసాలను వారిపైకి విసిరారు. ఓ బీరు సీసా దెబ్బకు అక్కడున్న ఒకరికి తాకడంతో గాయమైంది. దీంతో వారంతా రోడ్డుపై రావడంతో శశికుమార్, గ్యాంగ్ అక్కడి నుంచి ఉడాయించారు. సదరు సామాజిక వర్గానికి చెందిన వారు ఫిర్యాదు చేయడంతో  శివకుమార్ గ్యాం గ్ ను పట్టుకుని రిమాండ్‌కు తరలించి నట్లు సీఐ వివరించారు. ముద్రకోల శశికుమార్, గౌరబోయిన వెంకటేష్‌లపై గతంలో ఫిర్యాదులున్నాయని, దీంతో రౌడీ షీట్‌ను ఓపెన్ చేసినట్లు ఆయన వివరించారు. పట్టణంలో రాత్రి ఏ పని లేకుండా ఇద్దరు, ముగ్గురు మాట్లాడినట్లు రోడ్లపై కనిపిస్తే వారిపై న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిందితులను పట్టుకున్న ఐడీ పార్టీ కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, వేణు, కమలాకర్‌రెడ్డి, ఇర్ఫాన్‌లను సీఐ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement