మీడియాకు తప్పని తిప్పలు | media faces problem at metropolis summit | Sakshi
Sakshi News home page

మీడియాకు తప్పని తిప్పలు

Oct 7 2014 1:30 AM | Updated on Oct 9 2018 6:34 PM

అంతర్జాతీయ స్థాయి సదస్సును హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు అట్టహాసంగా ప్రకటించినా ప్రింట్ మీడియా ప్రతినిధులకు మాత్రం సోమవారం తిప్పలు తప్పలేదు.

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి సదస్సును హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు అట్టహాసంగా ప్రకటించినా ప్రింట్ మీడియా ప్రతినిధులకు మాత్రం సోమవారం తిప్పలు తప్పలేదు. మెట్రోపొలిస్ సదస్సు కవరేజీ కోసం వెళ్లిన విలేకరులను సదస్సు ప్రధాన వేదిక అయిన హేచ్‌ఐసీసీ వేదిక వద్దకూ అనుమతించలేదు. తర్వాత టీవీ చానెళ్లకు మాత్రం ఫీడ్‌ను ఇచ్చారు. అప్పుడు, ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగ్ అంటూ చివరికి మూడుగంటలకు ఏర్పాటుచేశారు.

 

ఈ విషయమై సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్‌ను విలేకరులు ప్రశ్నించగా.. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను అనుమతించలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement