విద్యార్థినిని వేధిస్తున్న మెకానిక్ అరెస్ట్ | Mechanic arrested for harassing girl | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని వేధిస్తున్న మెకానిక్ అరెస్ట్

Dec 3 2015 8:16 PM | Updated on Nov 9 2018 5:02 PM

ప్రేమపేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిని ముషీరాబాద్ పోలీసులు రిమాండ్‌కు పంపారు.

ముషీరాబాద్ : ప్రేమపేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిని ముషీరాబాద్ పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఎస్‌ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోలక్‌పూర్ డివిజన్ ఇందిరానగర్‌లో నివసించే నంది సురేష్(21) స్కూటర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇంటి పక్కనే నివసించే విద్యార్థినిని ప్రేమించాలని నాలుగు నెలలుగా వెంటపడుతున్నాడు.

ఈ విషయాన్ని బాధితురాలు నానమ్మకు తెలిపింది. ఆ యువకుడిని పిలిచి మందలించగా నానమ్మ దేవమ్మను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. దీంతో దేవమ్మ గురువారం ముషీరాబాద్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై నాలుగు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement