రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. ఈ ఘటన మండల పరిధిలోని నెమ్మికల్లు శివారులో ఆదివారం చోటుచేసుకుంది.
ఆత్మకూర్(ఎస్) రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. ఈ ఘటన మండల పరిధిలోని నెమ్మికల్లు శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్లు మండలం సోమ్లాతండాకు చెందిన రమావత్ రవి-మౌనిక దంపతులు. రవి సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. కాగా ఈనెల 14,15తేదీల్లో తండాలో జరిగిన కుల దేవత జాతరకు హాజరయ్యారు. ఆదివారం విధులకు హాజరయ్యేందుకు భార్యతో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయలుదేరారు. నెమ్మికల్ శివారులో వెనక నుంచి టిప్పర్ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో మౌనిక(22) అక్కడికక్కడే మృతి చెందగా,రవికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి అభిలాష్ తెలిపారు.