వరకట్న వేధింపులకు వివాహిత బలి | married woman committed suicide In Sangareddy | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులకు వివాహిత బలి

Apr 10 2016 11:50 AM | Updated on Nov 6 2018 7:56 PM

అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తుండటంతో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

 వరకట్న వేధింపులకు వివాహిత బలైంది. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తుండటంతో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి కల్పన(26)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన దగ్గరి నుంచే శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement