వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Aug 24 2015 3:50 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

కుంటాల (ఆదిలాబాద్) : ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కల్లూరు గ్రామానికి చెందిన బద్దం లక్ష్మి(38) గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది.

ఈ క్రమంలో జీవితం పై విరక్తి పుట్టి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement