అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి | Man Suspicious Death In Annapurna Studios | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి

May 31 2018 1:38 PM | Updated on May 31 2018 4:40 PM

Man Suspicious Death In Annapurna Studios - Sakshi

నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

సాక్షి, హైదరాబాద్: నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు.  ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement