మంత్రాల నెపంతో దారుణ హత్య | man killed in karim nagar district | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో దారుణ హత్య

Jul 1 2016 1:45 PM | Updated on Sep 4 2017 3:54 AM

ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం అభివృద్ధిపథాన దూసుకెళ్తుంటే.. మరో వైపు మంత్రాలు, చేతబడులు, బాణమతులను కొందరు ఇంకా నమ్ముతున్నారు.

మేడిపల్లి: ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం అభివృద్ధిపథాన దూసుకెళ్తుంటే.. మరో వైపు మంత్రాలు, చేతబడులు, బాణమతులను కొందరు ఇంకా నమ్ముతున్నారు. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం విలాయతాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పూదరి రాజం(50) రాళ్లు కొట్టుకుం ఉంటాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న రాజంపై అదే గ్రామానికి చెందిన బత్తుల రాజు, గంగాధర్ అనే అన్నదమ్ములు గొడ్డలితో దాడి చేశారు.

దీంతో తీవ్ర గాయాలైన రాజంను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజు, గంగాధర్‌ల బావ అనారోగ్యంతో మృతి చెందాడు. రాజం మంత్రాలు చేయడం ద్వారానే తమ బావ మృతి చెందాడని ఆగ్రహించిన అన్నదమ్ములు అతడిపై గొడ్డలితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement