నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం | Man held for attempted rape | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

May 3 2016 3:11 PM | Updated on Mar 28 2018 11:26 AM

అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేయగా గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన కీసర మండలం హైమత్‌గూడలో మంగళవారం జరిగింది.

- యువకుడికి గ్రామస్తుల దేహశుద్ధి

కీసర (రంగారెడ్డి జిల్లా) : అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేయగా గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన కీసర మండలం హైమత్‌గూడలో మంగళవారం జరిగింది. హైమత్‌గూడలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిని అజయ్(18) అదే కాలనీకి చెందిన ఓ చిన్నారిని ఆడుకుందాం రమ్మని పిలిచాడు.

అమాయకంగా వెళ్లిన ఆ చిన్నారికి తన సెల్‌లోని అసభ్య ఫొటోలు చూపిస్తూ అత్యాచారం చేయబోయాడు. ఈ సంఘటనను అదే కాలనీకి చెందిన సమీ, రహీంలు చూసి కాలనీ వాసులను పిలిచారు. చిన్నారిపై అత్యాచారం చేయబోయిన అజయ్‌కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement