రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | Man dies in road accident at Mahababu Nagar district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Feb 24 2015 12:01 AM | Updated on Oct 8 2018 5:04 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

మహబూబ్‌నగర్(దేవరకద్ర): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. వివరాలు... దేవరకద్ర మండలం చౌదరిపల్లి గ్రామం వద్ద ఓ ట్యాంకర్ అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. దీంతో ఆ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంఘటనా స్థలంలో ట్రాఫిక్‌ను మల్లిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జబ్బర్‌ను ఒక బైక్ పై ముగ్గురు వేగంగా వెళుతూ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement