breaking news
Devarakadhara
-
దైవ దర్శనానికి వెళ్లొస్తామంటూ.. ముగ్గురి బలవన్మరణం
దేవరకద్ర/దేవరకద్ర రూరల్: దైవ దర్శనానికి వెళ్లొస్తామని బంధువులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో తల్లి, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవరకద్రకు చెందిన బాలకిష్టమ్మ (55) కుమారుడు రాజు, కూతురు సంతోషతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజుల నుంచి బాలకిష్టమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. మరోవైపు లాక్డౌన్ కారణంగా వ్యాపారంలో నష్టం వచ్చింది. దాయాదులతో ఆస్తి తగాదాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మన్యంకొండ దేవస్థానానికి వెళ్లొస్తామని బంధువులకు చెప్పి ఈనెల 24న ఇంటి నుంచి బయలుదేరి తిరిగిరాలేదు. బుధవారం సాయంత్రం చౌదర్పల్లి గుట్టపై మొక్కలకు నీరు పోయడానికి వెళ్లిన కూలీలకు కుళ్లిన మూడు శవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి దర్యాప్తు చేయగా.. ఈ విషయం బయటపడింది. రెండురోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్(దేవరకద్ర): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. వివరాలు... దేవరకద్ర మండలం చౌదరిపల్లి గ్రామం వద్ద ఓ ట్యాంకర్ అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. దీంతో ఆ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలంలో ట్రాఫిక్‌ను మల్లిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జబ్బర్ను ఒక బైక్ పై ముగ్గురు వేగంగా వెళుతూ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.