దుకాణం పైకప్పు కూలి వ్యక్తి మృతి | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

దుకాణం పైకప్పు కూలి వ్యక్తి మృతి

Jun 7 2015 10:11 AM | Updated on Sep 15 2018 8:11 PM

ఇనుపు వస్తువులను అమ్ముకోవడానికి స్క్రాప్ దుకాణానికి వచ్చిన వ్యక్తి దుకాణం పైకప్పు కూలి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ తార్నాకలోని లాలాపేటలో ఉన్న ఓ దుకాణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

హైదరాబాద్ : ఇనుపు వస్తువులను అమ్ముకోవడానికి స్క్రాప్ దుకాణానికి వచ్చిన వ్యక్తి దుకాణం పైకప్పు కూలి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ తార్నాకలోని లాలాపేటలో ఉన్న ఓ దుకాణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అభిలాష్(20) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ ప్రకాశ్ నగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సెంట్రింగ్ సమయంలో మిగిలిన ఇనుప వస్తువులను అమ్ముకోవడానికి స్క్రాప్ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో దుకాణం పైకప్పు కూలడంతో అభిలాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement