కొడుకు మృతి వార్త విని కుప్పకూలిన తల్లిదండ్రులు | man died in a road accident | Sakshi
Sakshi News home page

కొడుకు మృతి వార్త విని కుప్పకూలిన తల్లిదండ్రులు

Mar 13 2015 7:39 PM | Updated on Aug 30 2018 3:56 PM

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన చనుబాల అనిల్(21) అనే యువకుడు రోడ్డుదాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.

సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన చనుబాల అనిల్(21) అనే యువకుడు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.  ఎస్సై ఇంద్రసేనారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం..   డ్యూటీకి వెళ్లేందుకు వచ్చి గర్రెపల్లి బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి వార్త తెలియగానే తల్లిదండ్రులు అంజమ్మ, మల్లేశంలు ఉన్నచోటునే కుప్పకూలిపోయారు. వెంటనే వారిని  సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement